prabhas: అబుదాబీ రాచకుటుంబంతో ప్రభాస్.. మహిళతో ముచ్చటిస్తున్న ఫొటో విడుదల

షార్ట్స్‌లో చూడండి
'బాహుబలి' బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు రూ. 200 కోట్లతో ప్రభాస్ కొత్త చిత్రం 'సాహో' తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సుజీత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ ను అబుదాబిలో చిత్రీకరిస్తున్నారు.
మరోవైపు, షూటింగ్ విరామ సమయంలో అబుదాబి రాచకుటుంబీకులను ప్రభాస్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాచకుటుంబానికి చెందిన ఓ మహిళతో ప్రభాస్ ముచ్చటిస్తున్న ఫొటోను శ్రేయాస్ మీడియా ఛైర్మన్ శ్రీనివాస్ ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు. అయితే, సమావేశానికి సంబంధించిన వివరాలు మాత్రం వెలుగులోకి రాలేదు. 
Go Back to Shorts
prabhas
saaho
abudhabi
royal family
meeting

More Telugu News