trivikram: రాజమౌళి సినిమా కోసం కూడా ఎన్టీఆర్ లుక్ మారుతుందట!

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరింత ఫిట్ నెస్ తో .. న్యూ లుక్ తో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో తన లుక్ తో పాటు శరీరాకృతిని మార్చుకున్నాడు. డైట్ విషయంలో శ్రద్ధ తీసుకుంటూ .. కండలు పెంచుతూ వచ్చాడు. ఈ లుక్ ఎన్టీఆర్ అభిమానులను ఆనందింపజేసేదిలా ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోను ఎన్టీఆర్ న్యూ లుక్ తో కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం కూడా లాయిడ్ స్టీవెన్స్ రంగంలోకి దిగుతాడని అంటున్నారు. త్రివిక్రమ్ మూవీని ఎన్టీఆర్ పూర్తిచేసిన వెంటనే ఆయన హైదరాబాద్ లో వాలిపోతాడని చెప్పుకుంటున్నారు. 
Go Back to Shorts
trivikram
rakjamouli

More Telugu News