Mahesh Babu: 'చంద్రబాబు అనే నేను...' భరత్ ను ఫాలో అయిన సీబీఎన్... వైరల్ అవుతున్న గల్లా జయదేవ్ వీడియో!

షార్ట్స్‌లో చూడండి
'భరత్ అనే నేను' చిత్రంలో టైటిల్ సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ పాటను చంద్రబాబుకు అన్వయిస్తూ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తయారు చేయించి పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. "విరచిస్తా..." అంటూ సాగే పాటలో "భరత్ అనే నేను..." అన్న పదాల వద్ద చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిననాటి మాటలను ఉంచిన జయదేవ్, ఆపై పాట ఆసాంతాన్ని వినిపిస్తూ, బాబు వీడియోలను జోడించారు.

1996లో హైటెక్ సిటీని చంద్రబాబు ప్రారంభించడం, పాదయాత్ర, వివిధ సంక్షేమ పథకాల వీడియో బిట్లను కలిపారు. పలు సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలను, అభివృద్ధి పథకాలు, వివిధ సదస్సుల ఫోటోలు, జాతీయ స్థాయిలో ఆయన అందుకున్న అవార్డులు, పుష్కరాల ఏర్పాట్లు, ప్రజలతో కలిసున్న చిత్రాలను ఉంచారు. అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న ఫొటోలను జోడించారు. గల్లా జయదేవ్ తన ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను మీరూ చూడండి.
Go Back to Shorts
Mahesh Babu
Galla Jayadev
Chandrababu
Bharath Ane Nenu

More Telugu News