ట్రంప్ ‘లోకల్’ రాజకీయం... అమెరికా కంపెనీలకే హెచ్1బీ వీసాల్లో పెద్ద పీట!
- అమెరికా కంపెనీలకు గతేడాది భారీగా పెరిగిన అనుమతులు
- అదే సమయంలో భారత కంపెనీలకు కోత
- అమేజాన్ కు పెద్ద మొత్తంలో కేటాయింపు
అమేజాన్ కు 2016లో దక్కినవి 1,416 అయితే, 2017లో ఈ సంఖ్య 2,515కు చేరడం గమనార్హం. ఫేస్ బుక్ కు కూడా 248 అధికంగా లభించాయి. యాపిల్ దరఖాస్తుల ఆమోదాల్లో 7 శాతం పెరుగుదల ఉంది. మరోవైపు 2015 నాటితో పోలిస్తే 2017 నాటికి భారత్ కు చెందిన ఏడు ఐటీ కంపెనీలకు హెచ్1బీ ఆమోదాల్లో 43 శాతం క్షీణత ఉన్న విషయం తెలిసిందే. అత్యధిక నైపుణ్యాలున్న విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఈ వీసాలను అమెరికా జారీ చేస్తుంది.