ఆశారాం బాపునకు జీవితఖైదు విధించిన జోధ్‌పూర్ కోర్టు!
- బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆశారాం బాపు
- దెయ్యం వదిలిస్తానని మభ్యపెట్టి అఘాయిత్యం
- ఇప్పటికే ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఆధ్యాత్మిక గురువు
2013 ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయికి దెయ్యం పట్టిందని, దాన్ని వదిలిస్తానని చెప్పిన ఆశారాం బాపు ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ విషయంపై ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. పోలీసులకు చిక్కకుండా దాక్కుంటోన్న ఆయనను ఎట్టకేలకు 2013 సెప్టెంబర్ 1న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులో ఉంటున్నారు.