శ్రియా భూపాల్ తో ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డి నిశ్చితార్థం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రియా భూపాల్ తో ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డి నిశ్చితార్థం

  •  చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడు అనిందిత్ రెడ్డి
  • వేడుకకు హాజరైన హీరో రామ్ చరణ్ దంపతులు
  • ఉపాసన తల్లి శోభన, అనిందిత్ తల్లి సంగీత అక్కాచెల్లెళ్లు  
ప్రముఖ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు (కజిన్) అనిందిత్ రెడ్డి నిశ్చితార్థం శ్రియా భూపాల్ తో జరిగింది. హైదరాబాద్ లో నిన్న జరిగిన ఈ వేడుకకు రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారాయి.

కాగా, అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి.రెడ్డి మనవడు, చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడు అనిందిత్ రెడ్డి. వృత్తి రీత్యా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్ లో అనిందిత్ కు మంచి పేరుంది. అనిందిత్ తల్లి సంగీత, ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెళ్లు. కాగా, గతంలో అఖిల్ అక్కినేని- శ్రియా భూపాల్ ప్రేమ వ్యవహారం తెలిసిందే. గతంలో వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది కానీ, అనివార్య కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు.
upasana
shriya bhupal

More Telugu News