టాలీవుడ్ సమస్యలపై కమిటీ ఏర్పాటు.. కన్వీనర్‌గా సుప్రియ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాలీవుడ్ సమస్యలపై కమిటీ ఏర్పాటు.. కన్వీనర్‌గా సుప్రియ

  • కొన్ని రోజులుగా టాలీవుడ్‌ని కుదిపేస్తోన్న సమస్యలు
  • 21 మంది సభ్యులతో కమిటీ
  • కొనసాగుతోన్న క్యాష్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ
తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే 'మా' ప్రకటించిన విషయం తెలిసిందే. యార్లగడ్డ సుప్రియ (అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌) కన్వీనర్‌గా 21మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఇందులో 24 విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. టాలీవుడ్‌కి సంబంధించిన విషయాలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై దుమారం చెలరేగుతోన్న నేపథ్యంలో క్యాష్ (కమిటీ ఎగనిస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) కమిటీ ఏర్పాటు ప్రక్రియ కూడా జరుగుతోందని సమాచారం. ఇందులో 21 మంది సభ్యులు ఉంటారు. వారిలో సగం మంది ప్రజా సంఘాల వారు, లాయర్లు ఉంటారు.
Tollywood
annapurna studio
maa

More Telugu News