'భరత్ అనే నేను-2'కావాల్సిందే... కొరటాలను కోరిన థమన్!
Add ap7am to your home Screen

'భరత్ అనే నేను-2'కావాల్సిందే... కొరటాలను కోరిన థమన్!

  • నిన్న విడుదలైన 'భరత్ అనే నేను'
  • సినిమా అద్భుతమన్న థమన్
  • సీక్వెల్ తీయాలని కోరిక
నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అనే నేను'పై టాలీవుడ్ సినీ ప్రముఖులు పొగడ్తలు గుప్పిస్తున్న వేళ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెడుతూ, సినిమా అద్భుతమని వ్యాఖ్యానించాడు.

మంచి కథను అత్యద్భుతంగా తెరకెక్కించారని, సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ ఎప్పుడూ ఇటువంటి సాంఘిక సినిమాలు చేయాల‌ని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు. సినిమా చూస్తున్నంత సేపూ, మ‌హేష్ నుంచి చూపు తిప్పుకోలేక‌పోయానని చెప్పిన థమన్, "ఈ సినిమాకు సీక్వెల్ చేయండి సార్" అంటూ దర్శకుడు కొరటాలను కోరాడు. 'భ‌ర‌త్ అనే నేను-2'ను జాతీయ స్థాయిలో తీసేలా ప్రణాళిక రూపొందించాలని కూడా థమన్ కోరాడు.
Bharath Ane Nenu
Mahesh Babu
SS Thaman

More Telugu News