సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఎవరూ బాధ్యులు కాదంటోన్న రకుల్
  • ముస్తాబవుతున్న 'అమ్మమ్మగారిల్లు' 
  • ఇద్దరు భామలతో కల్యాణ్ రామ్!  
*  సినిమా జయాపజయాల అంశం మా చేతుల్లో ఏమీ వుండదు.. అంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. 'ఒక సినిమా ఫ్లాప్ అయితే అది ఎందుకు అయిందని చాలా మంది నన్ను అడుగుతుంటారు. అలా అడగడం నాకు ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే, హిట్టు, ఫ్లాపు అన్నవి నా చేతుల్లో వుండదు. సినిమా బాగా రావాలనే అంతా కష్టపడతాం. అయితే ఒక్కోసారి మా ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. దానికి ఎవరూ బాధ్యులు కారు' అని చెప్పింది.
*  నాగ శౌర్య హీరోగా నటిస్తున్న 'అమ్మమ్మగారిల్లు' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్ ను ఈ 22న రిలీజ్ చేస్తారు. షామిలి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు.  
*  త్వరలో 'నా నువ్వే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా మరో చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ప్రముఖ కెమెరామెన్ గుహన్ చెప్పిన కథ నచ్చడంతో, దానికి ఓకే చెప్పాడని సమాచారం. ఇందులో నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తారట.  
 
Rakul
Nagashourya
kalyan

More Telugu News