sri reddy: శ్రీరెడ్డి వెనుకో.. మరో రెడ్డి వెనుకో ఉండాల్సిన అవసరం వైసీపీకి లేదు: అంబటి రాంబాబు
వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ వేశారని, పోరాటం చేస్తున్న తనను వాడుకోవాలని ప్రయత్నించారంటూ నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిిసందే. ఈ ఆరోపణలను వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీరెడ్డి వెనుకో..మరో రెడ్డి వెనుకో ఉండాల్సిన అవసరం వైసీపీకి లేదని అన్నారు.
ఇటువంటి వ్యాఖ్యలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని, ఏదైనా మాట్లాడదలచుకుంటే సూటిగా, ఘాటుగా మేమే మాట్లాడతాము తప్ప, ఎవరి వెనుక ఉండాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఎవరు ఏం చేసినా దాని వెనుక వైసీపీ ఉందంటూ కొందరు కుట్ర చేస్తున్నారని అంబటి విమర్శించారు.