‘బైశాఖి’ పండగ వేడుకల్లో పాల్గొనాలంటూ ప్రభాస్ కు ఆహ్వానాల వెల్లువ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘బైశాఖి’ పండగ వేడుకల్లో పాల్గొనాలంటూ ప్రభాస్ కు ఆహ్వానాల వెల్లువ!

  • పంజాబ్ లోని కళాశాలలు, యూనివర్శిటీల నుంచి ఆహ్వానాలు
  • ప్రభాస్ సన్నిహితుల సమాచారం
  • ‘సాహో’ షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్
పంజాబ్ లో అత్యంత ఘనంగా నిర్వహించే ‘బైశాఖి’ పండగ వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఆహ్వానాలు అందుతున్నాయట. ఈ విషయాన్ని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. పంజాబ్ లోని కళాశాలలు, యూనివర్శిటీల నుంచి  ప్రభాస్ కు అధిక సంఖ్యలో ఆహ్వానాలు అందుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న ప్రభాస్ వారి ఆహ్వానాలను మన్నించి, బైశాఖి వేడుకల్లో పాల్గొంటాడా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

కాగా, గత ఏడాది ‘బాహుబలి - 2’ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ లు పంజాబ్ లో జరిగిన బైశాఖి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఆ పండగలో పాల్గొనాలంటూ ప్రభాస్ కు ఆహ్వానాలు అందుతుండటం గమనార్హం.
prabhas
punjab

More Telugu News