ఫారిన్ ట్రిప్‌లో చైతూ-సమంత ఎంజాయ్...ఈ ఫొటో మాత్రం వెరీ స్పెషల్..!
- న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్కులో చైతూ-సమంత సందడి
- ఎనిమిదేళ్ల కిందట వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది అక్కడే
- థ్యాంక్స్ చెబుతూ సమంత ట్వీట్...ఫొటో అప్‌లోడ్
సాధారణంగా తనకు సెల్ఫీలంటే ఇష్టముండదని, కానీ ఈ సెల్ఫీకి మాత్రం మినహాయింపు ఉందని సమంత పేర్కొంది. ఎనిమిదేళ్ల కిందట తమ మధ్య ప్రేమ ఇక్కడే చిగురించిందని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. ఆ మ్యాజిక్‌కు థ్యాంక్స్ అని ట్వీట్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోని పోస్టు చేసింది. మరోవైపు చైతూ కూడా ఇదే ఫొటోని తన అకౌంట్‌లోనూ పోస్టు చేశాడు.
కాగా, 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఏ మాయ చేసావె' చిత్రంలో వారిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌ను ఈ సెంట్రల్ పార్కులో నిర్వహించారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ గతేడాది అక్టోబరులో మూడుముళ్లకు దారితీసింది.