సాయిపల్లవి స్థానంలో సమంత?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయిపల్లవి స్థానంలో సమంత?

  • దర్శకుడిగా శంతను భాగ్యరాజా
  • కథానాయికగా సాయిపల్లవి 
  • ఆమెను తప్పించారంటూ టాక్
తెరపై సాయిపల్లవి నటన చూసిన వాళ్లెవరూ ఆమె అభిమానులుగా మారకుండా ఉండలేరు. అలాంటి సాయిపల్లవి ధోరణి కారణంగా కొన్ని అవకాశాలు చేజారిపోతున్నాయనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. డోంట్ కేర్ అన్నట్టుగా ఆమె  వ్యవహరిస్తుందనీ .. షూటింగుకి చెప్పిన సమయానికి రాకుండా ఇబ్బంది పెడుతుందనే వార్తలు ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను వినిపిస్తున్నాయి. ఆమె మంచి నటి అయినప్పటికీ .. తన ఇష్టం అన్నట్టుగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 అలాంటి ధోరణి కారణంగానే ఓ తమిళ చిత్రంలోను ఆమె ఛాన్స్ కోల్పోయిందని చెప్పుకుంటున్నారు. భాగ్యరాజా తనయుడు శంతను భాగ్యరాజా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా కోసం నిత్యా మీనన్ ను .. సాయిపల్లవిని తీసుకున్నాడు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు గానీ .. సాయిపల్లవిని తప్పించి సమంతను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ధోరణి నచ్చకపోవడం కారణంగానే ఈ మార్పు జరిగిందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.   
samanta
nithya menon
sai pallavi

More Telugu News