ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోన్న 'ఆటగాళ్లు'
- పరుచూరి మురళి దర్శకత్వంలో 'ఆటగాళ్లు'
- ప్రధానపాత్రల్లో నారా రోహిత్ .. జగపతిబాబు
- వేసవిలో ప్రేక్షకుల ముందుకు
కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా షూటింగు పార్టును పూర్తిచేసుకోవడంతో, ఈ సినిమా టీమ్ గుమ్మడికాయ కొట్టేసింది. రవీంద్ర .. శివాజీ .. రాము .. జితేంద్ర సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, పరుచూరి మురళి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఫస్టులుక్ ను .. ఆ తరువాత ట్రైలర్ ను రిలీజ్ చేసి, వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బ్రహ్మానందం కామెడీ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు.