Ramcharan: భర్తకి వైవిధ్యంగా శుభాకాంక్షలు చెప్పిన ఉపాసన

షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు రామ్‌ చరణ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని అతని భార్య ఉపాసన శుభాకాంక్షలు చెప్పిన విధానాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. రంగస్థలం సినిమాకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఆకట్టుకున్న ఉపాసన, ‘హ్యాపీ బర్త్‌ డే మిస్టర్‌ సి’ అని పూలతో నేలపై రాసి శుభాకాంక్షలు తెలిపినట్టు వెల్లడించింది.

ఉపాసన పోస్టు చేసిన ఈ ఫొటోలో ఆమె బర్త్ డే విసెష్ ముందు నీలం జీన్స్‌ ప్యాంట్‌, తెల్ల చొక్కా, గోల్డ్‌ కలర్‌ వాచ్‌ ధరించిన రామ్ చరణ్ నిలబడి ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి ధరించిన చెప్పులపై ‘మిస్టర్‌ సి’ అని ఉండడంతో అది రామ్ చరణ్ అని అభిమానులు ఊహిస్తున్నారు. కాగా, ఈ ఫొటోను మెగా అభిమానులు లైకులతో హోరెత్తిస్తున్నారు. 
Go Back to Shorts
Ramcharan
upasana
birthday

More Telugu News