Chandrababu: బీజేపీకి దిమ్మతిరిగే మాట చెబుతా: నటుడు శివాజీ

  • చంద్రబాబు, జగన్, పవన్ లపై ఈగను కూడా వాలనివ్వను
  • నేతలకు కీడు తలపెడితే ఎవరితోనైనా పోరాడతాం
  • సాయంత్రంలోగా సంచలన విషయాలు చెబుతానన్న శివాజీ
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమతమ విధానాల్లో పోరాడుతున్న చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లపై ఈగను కూడా వాలనివ్వబోనని నటుడు శివాజీ వెల్లడించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ నేతలకు ఏదైనా కీడు తలపెడితే ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. తాను మూడో కన్ను తెరవనున్నానని, ఈ సాయంత్రం ఓ కీలక ప్రకటన చేస్తానని, దాంతో బీజేపీ దిమ్మ తిరుగుతుందని అన్నారు. ప్రజలకు సంచలన విషయాలను వెల్లడించనున్నానని, తన ప్రకటనతో ప్రత్యేక హోదా సాధన సమితికిగానీ, పార్టీలకుగానీ, వ్యక్తులకుగానీ సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
Chandrababu
Jagan
Pawan Kalyan
Sivaji
Special Category Status
BJP

More Telugu News