నడి రోడ్డుపై అశ్లీల దృశ్యాలు... అవాక్కైన ప్రజలు!
- మకాటి నగరంలోని రద్దీ రోడ్డుపై ఎలక్ట్రానిక్ బిల్ బోర్డుపై అశ్లీల దృశ్యాలు
- 30 సెకెన్ల పాటు ప్రసారమైన అశ్లీల దృశ్యాలు
- రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్
వాటిని చూసిన స్థానికులు నివ్వెరపోయారు. కొందరు యువకులు వాటిని సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవి వైరల్ గా మారాయి. ఈ ప్రసారాల కారణంగా ఆ మార్గంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులందడంతో మకాటి మేయర్ అబిగేల్ బినయ్ దీనిని నిర్వహిస్తున్న గ్లోబల్ ట్రానిక్స్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ బిల్ బోర్డ్ ను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీనికి కారణాలపై దర్యాప్తుకు ఆదేశించారు.