టైమ్ అంటే ఇదే .. వరుస ఆఫర్లతో పారితోషికం పెంచేసిన నాగశౌర్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టైమ్ అంటే ఇదే .. వరుస ఆఫర్లతో పారితోషికం పెంచేసిన నాగశౌర్య

  • 'ఛలో'తో హిట్ కొట్టిన నాగశౌర్య 
  • వరుసగా వస్తోన్న అవకాశాలు 
  • ఎక్కువైన యువ దర్శకుల సంప్రదింపులు
హీరో అంటే ఇలా ఉండాలి అనే మంచి హైట్ తో .. ఫిజిక్ తో నాగశౌర్య కనిపిస్తాడు. 'ఛలో'మూవీ భారీ విజయాన్ని సాధించడంతో, ఆయనకి అవకాశాలు వరుసబెడుతున్నాయి. యువ దర్శకులు చాలామంది ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కథకి ప్రాధాన్యతనిస్తూ .. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఆయన ఎంచుకుంటున్నాడు.

 అలా తాజాగా ఆయన 'నర్తనశాల'తో సెట్స్ పైకి వెళ్లాడు. ఆ తరువాత భవ్య క్రియేషన్స్ బ్యానర్లోను ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఇంతకు ముందు 'మజ్ను'తో యూత్ ను మెప్పించిన విరించి వర్మ కూడా, నాగశౌర్యకు ఒక కథను వినిపించాడని సమాచారం. ఇలా వరుసగా అవకాశాలు కలిసొచ్చి కాలింగ్ బెల్ కొడుతుండటంతో, ఆయన తన పారితోషికాన్ని 4 కోట్లు చేసినట్టు ఒక టాక్ వినిపిస్తోంది. మరో రెండు హిట్లు పడితే నాగశౌర్య ట్రాక్ ఎక్కేసినట్టే.       
nagashourya

More Telugu News