'టెంపర్' హిందీ రీమేక్ లో హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ కాదు!

  • 'సింబా'లో ప్రియా ప్రకాశ్ వారియర్ అంటూ ఇన్నాళ్లూ వార్తలు
  • కథానాయికగా సారా అలీఖాన్ ఎంపిక 
  • సోషల్ మీడియా మాధ్యమంగా ప్రకటించిన దర్శక, నిర్మాతలు
టాలీవుడ్‌ లో మంచి విజయం సాధించిన 'టెంపర్' సినిమాను బాలీవుడ్ లో 'సింబా' పేరిట రణ్‌ వీర్‌ సింగ్‌ తో రోహిత్ శెట్టి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కరణ్ జోహర్ నిర్మాత కావడంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సోషల్ మీడియా సంచలనం ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో నటించనుందంటూ గతంలో పలు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే.

వీటన్నింటినీ రూమర్స్ గా కొట్టిపడేసిన చిత్రయూనిట్ ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ను ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఈ మేరకు రోహిత్‌ శెట్టి, కరణ్‌ జోహార్‌ లు ఆమెతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కాగా, సారా అలీఖాన్ ‘కేదార్‌ నాథ్‌’ సినిమాతో బాలీవుడ్‌ అరంగేట్రం చేయనుంది.  
Go Back to Shorts
tempar
simba
priya prakash veriier
sara ali khan

More Telugu News