బాలీవుడ్ విలన్ కి పెరుగుతోన్న క్రేజ్ .. మరో యంగ్ హీరోతో ఢీ!
- 'సాక్ష్యం'తో పలకరించనున్న బెల్లంకొండ
- ఆ తరువాత మూవీ థ్రిల్లర్ జోనర్లో
- ఆల్రెడీ కొనసాగుతోన్న షూటింగ్
బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సాక్ష్యం' రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత నూతన దర్శకుడితో శ్రీనివాస్ థ్రిల్లర్ జోనర్లో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా నీల్ నితిన్ ముఖేశ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనీ, హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. విలన్ గా తెలుగులో నీల్ నితిన్ ముఖేశ్ జోరు పెరగడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.