raghuveera reddy: దేశంలో థర్డ్ ఫ్రంట్ కు అవకాశం లేదు: రఘువీరారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
దేశంలో థర్డ్ ఫ్రంట్ కు అవకాశం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తుందని, తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాని అవుతారని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు. థర్డ్ ప్రంట్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే వారు బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్నట్లే అని వ్యాఖ్యానించారు. 2019 లో యూపీఏ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ర‌ఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 5 తర్వాత  రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా రాజ‌కీయాల‌కు అతీతంగా  25 రోజులు పోరాడుదామని ఏపీ రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.

ఇటీవల ప్రవేశపెట్టిందే చివ‌రి బ‌డ్జెట్ అని, ఆ బ‌డ్జెట్‌లోనే స‌వ‌ర‌ణ‌లు జ‌ర‌గాలని, అలాగే ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అములు జరగాలని రఘువీరారెడ్డి అన్నారు. తమ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ 2019లో కేంద్రంలో యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలో వ‌స్తే తొలి సంత‌కం  ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసమే పెడతానని అన్నారని గుర్తు చేశారు.
Go Back to Shorts
raghuveera reddy
Congress
KCR

More Telugu News