కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై నేను కామెంట్ చేయను: సుజనా చౌదరి

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై తానేమీ కామెంట్ చేయనని ఏపీ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు పలు రకాల కారణాలు ఉండొచ్చు, కేసీఆర్ వ్యూహం ఏంటో? ఆయన గొప్ప రాజకీయవేత్త అని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలనే విషయాన్ని మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటి నుంచో చెబుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన ఈ మాట చెప్పారని అన్నారు. సామాజిక, ఆర్థిక సంస్కరణలు జరగాలని, డిజిటల్ మేనేజ్ మెంట్ కావాలనే విషయాలను భారతదేశంలోనే మొట్టమొదట ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని, కనుక, ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాను కామెంట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహాదా గురించి మాట్లాడుతూ, ఏపీకి రావాల్సిన వాటన్నింటిని సాధించి తీరుతామని అన్నారు. ఏపీపై ప్రధాని మోదీకి ఎటువంటి కోపమూ లేదని, ఇదేమి కుటుంబ వ్యవహారం కాదు కదా కోపతాపాలు చూపించేందుకని సుజనా అన్నారు. 
Go Back to Shorts
Sujana Chowdary
KCR

More Telugu News