టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

  • భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్‌
  • కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20
  • రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి
భార‌త్, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య ముక్కోణ‌పు టీ20 సిరీస్ ప్రారంభం అయింది. మొదటి మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక తలబడుతున్నాయి. విరాట్ కోహ్లీ గాయంతో బాధపడుతోన్న నేపథ్యంలో ఆయనకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగింది. టాస్ గెలిచిన శ్రీలంక.. మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రైనా, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, రిషబ్ పాంత్, వాషింగ్టన్ సుందర్, విజయ్ శంకర్, శార్దూల్ ఠాకూర్, జయ్‌దేవ్, ఛాహెల్ ఉన్నారు. ఈ మ్యాచ్‌ కొలంబో వేదికగా జరుగుతోంది.
Go Back to Shorts
India
Sri Lanka
Bangladesh
Cricket

More Telugu News