surya: సూర్య మూవీ నుంచి ఫస్టులుక్ వచ్చేసింది!

షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా సినిమాకి .. సినిమాకి మధ్య పెద్ద గ్యాప్ లేకుండగా సూర్య జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. అలాగే తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'ఎన్.జి.కె.' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దర్శకుడు సెల్వరాఘవన్ పుట్టినరోజు ఈ రోజు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదిలారు. ఈ పోస్టర్ లో సూర్య చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. సూర్యకి ఇది 36 వ సినిమా .. ఆయన సరసన రకుల్ .. సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు. మాస్ ఆడియన్స్ కి నచ్చే కథాంశంతో మరోసారి పలకరించడానికి వస్తోన్న సూర్య, ఈ సారి భారీ విజయాన్ని నమోదు చేస్తాడేమో చూడాలి.      
Go Back to Shorts
surya
rakul
sai pallavi

More Telugu News