దద్దమ్మ కేసీఆర్.. కేంద్రాన్నే ప్రశ్నిస్తారా? బండారు దత్తాత్రేయ ధ్వజం
- లక్షన్నర కోట్ల బడ్జెట్ లో వ్యవసాయానికి 10 వేల కోట్లు కూడా కేటాయించలేదు
- ఇలాంటి దద్దమ్మలా కేంద్రాన్ని ప్రశ్నించేది
- కేసీఆర్ కపట రాజకీయాలతో అందరూ విస్తుపోతున్నారు
కేసీఆర్ కపట రాజకీయాలను చూసి అందరూ విస్తుపోతున్నారని దత్తాత్రేయ అన్నారు. వ్యవసాయం పేరిట కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే విధంగా కేసీఆర్ రాజకీయాలు ఉన్నాయని... తెలంగాణ రైతులు వాస్తవాలను గ్రహిస్తున్నారని చెప్పారు. పస లేని వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయిని దిగజార్చుకోరాదని సూచించారు.