‘గురువారం మార్చి 1.. సాయంత్రం ఫైవ్ ఫార్టీ.. ’అంటున్న నెటిజన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘గురువారం మార్చి 1.. సాయంత్రం ఫైవ్ ఫార్టీ.. ’అంటున్న నెటిజన్లు

  • ఏడేళ్ల క్రితం విడుదలైన ‘దూకుడు’
  • ‘నా హృదయానికి అతిదగ్గరగా ఉండే చిత్రమిది
  • నాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు సంపాదించి పెట్టిన బ్లాక్ బస్టర్ హిట్
  •  సంగీత దర్శకుడు థమన్ స్పందన
ఏడేళ్ల క్రితం విడుదలైన మహేశ్ బాబు సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘దూకుడు’. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని ఓ పాట ట్రెండింగ్ గా మారింది. ఈ సినిమాలో మహేశ్, సమంతలపై చిత్రీకరించిన ‘గురువారం మార్చి 1.. సాయంత్రం ఫైవ్ ఫార్టీ.. తొలిసారిగా చూశానే నిన్ను.. చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్స్ పెట్టి.. నిదురే పోనందే నా కన్ను’ అనే పాట పెద్ద హిట్టు.

సరిగ్గా ఈరోజు గురువారం మార్చి 1 కావడంతో నెటిజన్లు ఈ పాటను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘దూకుడు’ సంగీత దర్శకుడు థమన్ కూడా స్పందించాడు. ‘నా హృదయానికి అతిదగ్గరగా ఉండే చిత్రమిది. మన సూపర్ స్టార్ తో నా మొదటి చిత్రం. 2011లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన, నాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు సంపాదించి పెట్టిన ‘దూకుడు’ ఆడియో & మూవీ బ్లాక్ బస్టర్ హిట్.. గురువారం మార్చొకటి ఈరోజు’ అంటూ తమన్ తన ట్వీట్ లో సంతోషం వ్యక్తం చేశాడు.  
Mahesh Babu
thaman

More Telugu News