nani: నానితో త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్?

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం నాని .. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమా చేస్తున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్ 12వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తో సినిమాకి త్రివిక్రమ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు.

 ఈ సినిమా తరువాత నానితో త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 'అత్తారింటికి దారేది' తరహాలో ఈ కథ ఉంటుందని అంటున్నారు. నాని కూడా అవసరాల శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అందువలన వచ్చే ఏడాదిలో నాని - త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.   
Go Back to Shorts
nani
trivikram

More Telugu News