'సాహో' కోసం భారీ సెట్ వేయక తప్పదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' కోసం భారీ సెట్ వేయక తప్పదట!

  • దుబాయ్ వెళ్లాలనుకున్న 'సాహో' టీమ్ 
  • అక్కడి నుంచి రాని అనుమతులు 
  • ఆలోచనలో పడిన దర్శక నిర్మాతలు
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగును దుబాయ్ .. అబుదాబి ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. విదేశీ ఫైట్ మాస్టర్ల ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ను అక్కడ ప్లాన్ చేశారు. అక్కడ అనుమతులు లభిస్తాయనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. అంతా రెడీ చేసుకున్నాక .. అక్కడి నుంచి అనుమతులు రావడం కష్టమేననే విషయం అర్థమైందట.

 ఎంతగా ప్రయత్నించినా అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో, రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో సెట్ వేసి షూటింగ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదు. ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బు .. సమయం ఖర్చు చేయవలసి ఉంటుంది. సెట్ లో చిత్రీకరించడం వలన, గ్రాఫిక్స్ కూడా అవసరమవుతాయి. అందువలన ఈ సినిమా టీమ్ ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు.     
prabhas
shraddha kapoor

More Telugu News