యువకుడిగా .. మధ్య వయస్కుడిగా శర్వానంద్!
- హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్
- రెండు విభిన్నమైన పాత్రలు
- కథానాయికగా సాయి పల్లవి
ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్నమైన పాత్రలను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆ పాత్రలు ఎలా వుండనున్నాయోననే ఆసక్తి అందరిలో తలెత్తింది. ఈ సినిమాలో శర్వానంద్ 25 యేళ్ల యువకుడిగాను .. 45 యేళ్ల మధ్య వయస్కుడిగాను కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో శర్వానంద్ ఒక పాత్ర కోసం బరువు తగ్గి .. మరో పాత్ర కోసం బరువు పెరగవలసి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే .