మహేశ్ .. బన్నీ రిలీజ్ డేట్స్ ఖరారు చేసుకున్నారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ .. బన్నీ రిలీజ్ డేట్స్ ఖరారు చేసుకున్నారు!

  • 'భరత్ అనే నేను'తో మహేశ్ బాబు 
  • ఏప్రిల్ 20వ తేదీన విడుదల 
  • ' నా పేరు సూర్య'తో అల్లు అర్జున్ 
  • మే 5వ తేదీన రిలీజ్
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'భరత్ అనే నేను' .. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'నా పేరు సూర్య' సినిమాలను ఏప్రిల్ 26న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు రావడం థియేటర్ల పరంగా .. వసూళ్లపరంగా ప్రభావం చూపుతుందని ఇండస్ట్రీ పెద్దలు భావించి రంగంలోకి దిగారు. రెండు సినిమాల మధ్య రెండు వారాల గ్యాప్ ఉండటం మంచిదనే ఉద్దేశంతో ఇద్దరు నిర్మాతలను ఒప్పించారు. ఫలితంగా 'భరత్ అనే నేను' సినిమా ఏప్రిల్ 20ని విడుదల తేదీగా ఖరారు చేసుకుంది. 'నా పేరు సూర్య' సినిమా మే 4వ తేదీని ఫిక్స్ చేసుకుంది. దర్శక నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇద్దరు హీరోలు ఏకీభవించారట. మొత్తానికి మహేశ్ బాబు సినిమా అనుకున్న దానికంటే వారం రోజుల ముందుగానే వచ్చేస్తుందన్న మాట.           
Mahesh Babu
allu arjun

More Telugu News