సమయానికంటే ముందే వచ్చినా.. ప్రయాణికుడిని విమానం ఎక్కనివ్వని 'ఇండిగో'

  • మరోసారి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ పై ఆరోపణలు
  • వీడియోలో తన బాధ చెప్పుకున్న ప్రయాణికుడు
  • హైదరాబాద్‌ నుంచి గోవా వెళ్లడానికి 6ఈ-743 విమానం ఎక్కడానికి వచ్చాను
  • విమానం ఎక్కకుండా అడ్డుపడ్డారు
తనను విమానం ఎక్కకుండా అడ్డుపడ్డారని దేశీయ విమాన సంస్థ ఇండిగో సిబ్బందిపై ఓ ప్రయాణికుడు ఆరోపణలు చేశాడు. ఇప్పటికే ఇండిగో ఎయిర్‌ లైన్స్ వివాదాల్లో చిక్కుకుని పలుసార్లు వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా, అదే సంస్థపై ఇటువంటి ఆరోపణలు రావడం గమనార్హం. ఇండిగో సిబ్బంది తీరును వివరిస్తూ సదరు ప్రయాణికుడు ఓ వీడియో కూడా విడుదల చేశాడు.

తాను హైదరాబాద్‌ నుంచి గోవా వెళ్లడానికి 6ఈ-743 విమానం ఎక్కడానికి, రావాల్సిన సమయం కంటే ముందుగానే వచ్చానని ఆ వీడియోలో తెలిపాడు. అయినప్పటికీ విమాన సిబ్బంది ఆలస్యంగా వచ్చానని తనను విమానం ఎక్కనివ్వలేదని అన్నాడు. అతడితో పాటు ఓ మహిళ, పిల్లాడు కూడా ఉన్నారు. వారిని కూడా విమానం ఎక్కడానికి అంగీకరించలేదని తెలిసింది. విమానం వద్దకు వెళ్లడానికి ఎయిర్‌పోర్టులో కేటాయించిన బస్సుని కూడా తాము ఎక్కామని, ఒకవేళ తాము ఆలస్యంగా వస్తే బస్సు ఎందుకు ఎక్కనిస్తారని ఆయన అడిగాడు. 
Go Back to Shorts
airlines
indigo
airplane

More Telugu News