మహేశ్ .. బన్నీ సినిమాల రిలీజ్ డేట్స్ లో తాజా మార్పులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ .. బన్నీ సినిమాల రిలీజ్ డేట్స్ లో తాజా మార్పులు

  • ఏప్రిల్ 21 లేదా 22 తేదీల్లో 'భరత్ అనే నేను' 
  • మే 5వ తేదీకి వెళ్లిన 'నా పేరు సూర్య'
  • ఏప్రిల్ 27వ తేదీన రజనీ 'కాలా'  
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ కథానాయకుడిగా 'భరత్ అనే నేను' రూపొందుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ఇంతకుముందు ప్రకటించారు. అదే రోజున 'నా పేరు సూర్య'ను విడుదల చేయనున్నట్టుగా అంతకుముందే ఈ సినిమా టీమ్ ఎనౌన్స్ చేసింది. ఆ తరువాత రెండు సినిమాలవారు ఒకేసారిగా తమ విడుదల తేదీలను ఒక రోజు ముందుకు జరుపుకున్నారు. దాంతో రెండు సినిమాల దర్శక నిర్మాతల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే .. రెండింటికీ అంత మంచిది కాదనే ఉద్దేశంతో పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగి .. ఈ సమస్యను పరిష్కరించారట. ఈ కారణంగా 'భరత్ అనే నేను' ఏప్రిల్ 21 లేదా 22వ తేదీల్లో విడుదల కానుంది. ఇక ' నా పేరు సూర్య' మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల మధ్య .. అంటే ఏప్రిల్ 27న 'కాలా' విడుదల కానుంది.       
Mahesh Babu
allu arjun

More Telugu News