'సాక్ష్యం' తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఇదేనట!
- చివరి దశలో బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం'
- ఓంకార్ తో సినిమా అనేది ప్రచారం మాత్రమే
- నూతన దర్శకుడితో ఈ నెల 23న సెట్స్ పైకి
నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి బెల్లంకొండ శ్రీనివాస్ రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుందనీ, మార్చి 2వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు వుండనున్నారని అంటున్నారు. మల్టీ డైమన్షన్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.