త్రివిక్రమ్ మూవీకి అనిరుథ్ కి బదులుగా తమన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ మూవీకి అనిరుథ్ కి బదులుగా తమన్!

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ  
  • ముందుగా వినిపించిన అనిరుథ్ పేరు 
  • కొత్తగా తెరపైకి తమన్ పేరు
త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉందనే సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి. రేపో మాపో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. త్రివిక్రమ్ ఇంతకు ముందు చేసిన 'అజ్ఞాతవాసి' సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. ఆయనే ఎన్టీఆర్ సినిమాకి కూడా బాణీలను సమకూర్చుతాడనే టాక్ వినిపించింది.

కానీ ఆయన స్థానంలో తమన్ ను తీసుకోవడానికి త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడనే వారు లేకపోలేదు. 'అ ఆ' సినిమాకి మిక్కీ జె.మేయర్ తో బాణీలు చేయించుకున్న త్రివిక్రమ్ .. 'అజ్ఞాతవాసి'కి అనిరుథ్ కి అవకాశం ఇచ్చాడు. అలాగే ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిని మార్చవచ్చనీ, తమన్ కి ఛాన్స్ ఇవ్వొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది త్వరలోనే తెలియనుంది.   
trivikram
thaman

More Telugu News