YSRCP: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతాం.. ఆ పని టీడీపీ చేసినా మద్దతిస్తాం!: వైఎస్ జగన్

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, మార్చి చివరి వారంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, టీడీపీ తమకు మద్దతు ఇస్తుందా? అని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు.

ఒకవేళ కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెడితే మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ వేదికగా ఏపీకి హోదా కోసం ఎంపీలు పోరాటం చేస్తారని, అప్పటికీ హోదా రాకుంటే ఏప్రిల్ 6న లోక్ సభకు తమ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
YSRCP
Jagan
kandukur

More Telugu News