అనుష్కకు మరో ఛాలెంజింగ్ ఆఫర్.. భానుమతిగా స్వీటీ?
- 'మహానటి'లో భానుమతి పాత్రలో నటించే ఛాన్స్
- అనుష్క అంగీకారంపై నెలకొన్న సస్పెన్స్
- వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు 'మహానటి'
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత ఇందులో పాత్రికేయురాలి పాత్ర చేసింది. సావిత్ర, భానుమతి సమకాలీన నటీమణులు. ఇద్దరూ ఆ సమయంలో పోటాపోటీగా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నవారే. మహానటి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ తన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ బాణీలు అందించారు. వచ్చే నెల 20న దీనిని రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.