Chandrababu: జగన్నాటకాలు అని పత్రికలు రాసినట్లుగా ఆ నాటకాలను ప్రజలకు తెలపండి: చ‌ంద్ర‌బాబు

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీకి టీడీపీ నేత‌లు ఎందుకు వెళుతున్నారో, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎందుకు వెళుతున్నారో ప్ర‌జ‌ల‌కు తెల‌పాలంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌మ నేత‌ల‌తో అన్నారు. తాను ఇప్ప‌టికి 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని తెలిపారు. జగన్నాటకాలు అని పత్రికలు రాసినట్లుగా ఆ నాటకాలను ప్రజలకు తెలపండని పిలుపునిచ్చారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు ప‌న్నినా వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారాలను టీడీపీ నేత‌లు స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌డం లేద‌ని చంద్ర‌బాబు అభిప్రాయపడ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏర్పాటు చేస్తోన్న‌ జేఎఫ్సీతో టీడీపీకి ఎటువంటి ఇబ్బందీ లేద‌ని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Pawan Kalyan
Telugudesam

More Telugu News