YSRCP: తెలుగోడి పౌరుషాన్ని తెలియజేయడానికే రాజీనామాల నిర్ణయం: వైవీ సుబ్బారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలుగోడి పౌరుషాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో రాజీనామాల నిర్ణయం తీసుకున్నామని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది తమ పార్టీయేనని అన్నారు. రాజీనామాల నిర్ణయం టీడీపీకి చెంపపెట్టు లాంటిదని, ఈ నిర్ణయంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిందని, ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబునాయుడు మాత్రం భయపడుతున్నారని విమర్శించారు.

ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేయాలని టీడీపీ చూస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు రావాలన్నదే తమ లక్ష్యమని, ఈ అంశాలను ప్రధానంగా చేసుకుని పోరాడతామని పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారని, అలాంటప్పుడు, ఈ విషయమై ఆయన మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడరని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.  
Go Back to Shorts
YSRCP
subba reddy

More Telugu News