Jagan: తమ పార్టీ నేతలతో ప్రత్యేకంగా జగన్ కీలక చర్చలు.. కాసేపట్లో మీడియా ముందుకు

షార్ట్స్‌లో చూడండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎంపీలు, కీలక నేతలతో కీలక చర్చలు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో ఈ భేటీ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ పై టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

బడ్జెట్ తో పాటు తాము భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ముగిసిన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.   
Go Back to Shorts
Jagan
YSRCP
meet

More Telugu News