'అమ‌రావ‌తిని ఢిల్లీ కంటే గొప్ప‌ది చేస్తమ‌న్నారూ.. మోదీగారూ'.. అంటూ పాట పాడి ఎంపీ శివ‌ప్ర‌సాద్ వినూత్న నిర‌స‌న‌

  • పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన
  • ఓ పాటను పేరడీ చేసి పాడిన ఎంపీ శివప్రసాద్
  • కాంగ్రెస్‌కి పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరిక
టీడీపీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ పార్లమెంటు ఆవరణలో మరోసారి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కి మరోసారి అన్యాయమే జరిగిందని తెలుపుతూ ఆయన పాట పాడారు. 'భూమికి పచ్చనీ రంగేసినట్లు.. అమ్మలాలా..' అనే పాటను పేరడీ చేసి పాడారు. 'విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు ఇస్తారు.. మోదీగారూ..', 'అమ‌రావ‌తిని ఢిల్లీ కంటే గొప్ప‌ది చేస్తామ‌న్నారూ.. మోదీగారూ..' అంటూ పాడారు. కాంగ్రెస్ ఇప్పటికే పెద్ద తప్పు చేసిందని బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. మరోవైపు ఇతర టీడీపీ ఎంపీలు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అని ఆయన వెనుక ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు.
Go Back to Shorts
amaravati
New Delhi
shivaprasad

More Telugu News