సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సీక్వెల్ కి రెడీ అంటున్న యాంకర్ రష్మి 
  • 'నా నువ్వే' కోసం హీరో ఇంట్రడక్షన్ సాంగ్ 
  • మంచి లాభాల్లో నాగశౌర్య సినిమా 
  • కాస్త ముందుగానే రజనీ సినిమా 'కాలా' 
*  ఆమధ్య వచ్చిన వచ్చిన 'గుంటూర్ టాకీస్ చిత్రంలో హాట్ సన్నివేశాలలో నటించిన టీవీ యాంకర్ రష్మి.. 'గుంటూర్ టాకీస్ 2' చిత్రంలో నటించడానికి కూడా తాను రెడీ అని ప్రకటించింది. అయితే, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తేనే తాను నటిస్తానని పేర్కొంది.
*  నందమూరి కల్యాణ్ రాం, తమన్నా జంటగా రూపొందుతున్న 'నా నువ్వే' చిత్రం కోసం హీరో ఇంట్రడక్షన్ సాంగును ప్రస్తుతం హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ మొత్తం మరో మూడు రోజుల్లో పూర్తికానుంది. ఇప్పటికే తమన్నా ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసింది. జయేంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
*  నాగశౌర్య హీరోగా రూపొందిన 'ఛలో' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయిన సంగతి విదితమే. ఈ చిత్రం ఇప్పటికే ఆరు కోట్లకు పైగా వసూలు చేయడంతో చిత్ర నిర్మాతలు మంచి లాభాల్లో వున్నట్టు చెబుతున్నారు.
*  రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కాలా' చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో సీక్వెల్ '2.O' నిర్మాణానికి సంబంధించిన గ్రాఫిక్ పనులు ఆలస్యం అవుతుండడంతో ముందుగా 'కాలా'ను రిలీజ్ చేయాలని నిర్ణయించారట.      
Rashmi
kalyan
nagashourya
rajani

More Telugu News