శ్రీదేవి సాధించిన రికార్డు దిశగా దూసుకెళ్తోన్న అనుష్క
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవి సాధించిన రికార్డు దిశగా దూసుకెళ్తోన్న అనుష్క

  • కొనసాగుతోన్న 'భాగమతి' జోరు 
  • తెలుగు రాష్ట్రాల్లో 28.5 కోట్ల గ్రాస్ 
  • ప్రపంచవ్యాప్తంగా 58.9 కోట్ల గ్రాస్
అనుష్క ప్రధాన పాత్రగా అశోక్ తెరకెక్కించిన 'భాగమతి' సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయవిహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 28.5 కోట్ల గ్రాస్ ను .. 17.95 కోట్ల షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 58.9 కోట్ల గ్రాస్ ను .. 30.9 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక్క నైజాంలోనే ఈ సినిమా 11కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం.

 కర్ణాటక .. తమిళనాడు.. కేరళలోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.  యూఎస్ లో స్టార్ హీరోల సినిమాల స్థాయిలో 'భాగమతి' 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. గతంలో శ్రీదేవి చేసిన 'ఇంగ్లిష్ వింగ్లిష్' మూవీ 1.85 మిలియన్ డాలర్లను వసూలు చేసి, కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల వసూళ్లలో కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పుడు 'భాగమతి'గా ఆ రికార్డు దిశగా అనుష్క దూసుకుపోతోంది. శ్రీదేవి రికార్డును అనుష్క అధిగమిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.      
anushka

More Telugu News