jashodaben: మోదీ భార్య జశోదాబెన్ కు యాక్సిడెంట్.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదాబెన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాజస్థాన్ లోని కోటాలో జరిగిన ఓ వేడుకకు కుటుంబసభ్యులతో కలసి హాజరై, గుజరాత్ కు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చిత్తోర్ ఘర్ లోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. కోటా-చిత్తోర్ హైవేపై ఈ ప్రమాదం సంభవించింది.

ప్రస్తుతం ఆమె తన సోదరుడు అశోక్ మోదీతో కలసి గుజరాత్ లోని మెహ్సానా జిల్లా ఉంఝా పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆమెకు మెహ్సానా జిల్లా పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
Go Back to Shorts
jashodaben
Narendra Modi
road accident

More Telugu News