భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి వైదొలగిన దక్షిణాఫ్రికా క్రికెటర్ డీకాక్
- ఎడమ చేతి మణికట్టు గాయంతో బాధపడుతోన్న వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్
- విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
- ఎల్లుండి భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే
బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో డీకాక్ ఎడమ చేతి మణికట్టుకు తీవ్ర గాయమైందని, ఆయన దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ ప్రకటించింది. కాగా, భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే ఎల్లుండి సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది.