'సాహో' సన్నివేశాల చిత్రీకరణలో ప్రభాస్ జోక్యం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' సన్నివేశాల చిత్రీకరణలో ప్రభాస్ జోక్యం!

  • షూటింగు దశలో 'సాహో'
  • ప్రతి సీన్ పై ప్రభాస్ శ్రద్ధ 
  • వచ్చే ఏడాదే విడుదల
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక నైపుణ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివిధ విభాగాల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి సీన్ గురించి దర్శకుడితో ప్రభాస్ చర్చిస్తున్నాడట.

దర్శకుడు ఆ సీన్ ను ఎలా తీయాలనుకుంటున్నాడు .. ఆడియన్స్ ను అది ఎంతవరకూ ఆకట్టుకుంటుంది అనే విషయాలను గురించిన ఆలోచన చేసి మరీ ఓకే చెబుతున్నాడని అంటున్నారు. అవుట్ పుట్ హాలీవుడ్ రేంజ్ లో వుండాలనే నిర్ణయానికి రావడం వలన, విడుదల విషయంలో హడావిడి అవసరంలేదనే నిర్ణయానికి వచ్చారట. ఈ కారణంగానే .. ముందుగా చెప్పినట్టు ఈ ఏడాది ఈ సినిమా విడుదల ఉండదని తెలుస్తోంది. వచ్చే ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 
prabhas
shraddha kapoor

More Telugu News