అభిమానులతో కలసి సినిమా చూడనున్న అనుష్క.. ఏ ఊర్లో, ఎప్పుడో చూడండి!
- 5వ తేదీన భాగమతి థ్యాంక్స్ టూర్
- మహిళలతో కలసి సినిమా చూడనున్న అనుష్క
- మహిళలకు థ్యాంక్స్ చెప్పేందుకు టూర్
ఇందులో భాగంగా అనుష్కతో కలసి సినిమా చూసే అవకాశాన్ని మహిళలకు కల్పిస్తోంది. సోమవారం నాడు మార్నింగ్ షోను విజయవాడలోని రాజ్ థియేటర్ లో, మ్యాట్నీని ఏలూరులోని మినీ సత్యన్నారాయణ థియేటర్ లో, ఫస్ట్ షోను రాజమండ్రిలోని స్వామి థియేటర్ లో మహిళా ప్రేక్షకులతో కలసి అనుష్క 'భాగమతి' సినిమాను చూడనుంది.