రాజకీయాల్లోకి సమంత... టీఆర్ఎస్ తరపున పోటీ?: సోషల్ మీడియాలో వైరల్ వార్త

  • సమంత రాజకీయాల్లోకి రానుందంటూ సోషల్ మీడియాలో వైరల్ న్యూస్
  • చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా మీటింగ్ లో పాల్గొన్న సమంత
  • దీంతో సోషల్ మీడియాలో పుకార్లు 
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత రాజకీయాల్లోకి రానుందని, 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయనుందని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. దీనిపై ఆమె ప్రతినిధులు స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆమెకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని వారు స్పష్టంగా చెప్పారు.

కాగా, సమంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొనడంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది. ఇదిలా వుండగా, సుకుమార్, రామ్ చరణ్ తేజ్ ల కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ సినిమాలో సమంత నటిస్తుండగా, తమిళంలో విశాల్‌ సరసన ఆమె నటించిన ‘ఇరుంబుతిరై’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది తెలుగులో ‘అభిమన్యుడు’గా రానుంది. ఇక ‘మహానటి’, ‘యూటర్న్‌’ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. 
Go Back to Shorts
samantha
political entry
samanta in TRS

More Telugu News