ఉత్తరాన్ని పిల్ గా స్వీకరించి శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు షాకిచ్చిన హైకోర్టు!
- తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థను శాసిస్తున్న శ్రీచైతన్య, నారాయణ కళాశాలలు
- ఈ కాలేజీల్లో ఆత్మహత్యలు పెరిగాయంటూ లేఖ రాసిన ఇమ్మానుయేల్
- ఆ లేఖను పిల్ గా స్వీకరించిన హైకోర్టు
ఆ ఉత్తరాన్ని పిల్ గా స్వీకరించిన హైకోర్టు సదరు కళాశాలల యాజమాన్యాలకు నోటీసులిచ్చింది. వాటితో పాటు దీనిపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కూడా నోటీసులిచ్చింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.