ke prabhakar: ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ప్రమాణ స్వీకారం

షార్ట్స్‌లో చూడండి
కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేఈ ప్రభాకర్ ఈ రోజు ఉదయం అమ‌రావ‌తిలో ఏపీ శాసనసభ భవనంలోని శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) హాల్ లో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూఖ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆ తరువాత ప్రమాణ స్వీకార పత్రంపై ప్రభాకర్ సంతకం చేశారు. శాసనమండలి నియమావళిని చైర్మన్ ఫరూఖ్ ఆయనకు అందజేశారు.
  ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి (బోయ) ఫెడరేషన్ చైర్మన్ బీటీ నాయుడు, శాసనసభ ఇన్ చార్జి కార్యదర్శి ఎం.విజయరాజు, పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ భవనం బయట ప్రభాకర్ మాట్లాడుతూ తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకున్న పూర్వ అనుభవంతో పెద్దల సభలో స‌ఖ్య‌త‌తో వ్యవహరిస్తానని చెప్పారు. శిల్పా చక్రపాణి రెడ్డి కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగిన విష‌యం తెలిసిందే.

Go Back to Shorts
ke prabhakar
Kurnool District
Telugudesam

More Telugu News