మహేష్-కొరటాల చిత్రం ఫస్ట్ లుక్ జనవరి 26న.. ఆసక్తికరంగా పోస్టర్ విడుదల!
- కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను'
- పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాతలు
- సీఎంగా ప్రమాణ స్వీకారం మాటలు
- 26న విడుదల కానున్న ఫస్ట్ లుక్
లక్షలాది మంది ప్రజలు కనిపిస్తున్న ఫొటోపై "శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అనే అక్షరాలు కనిపిస్తున్నాయి.
ఇందులో మహేష్ బాబు స్క్రీన్ నేమ్ 'భరత్' ఎక్కడా కనిపించకపోయినప్పటికీ, ఈ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.